న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కరోనా కలవరపెడుతున్న నేపథ్యంలో దూరదర్శన్ పలు ఆసక్తికర ప్రసారాలను పునఃప్రసారం చేయనుంది. ఇప్పటికే దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు రామాయణం, మహభారతం సీరియళ్లను మళ్లీ ప్రసారం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని పాత షోలను సైతం పునః ప్రసారం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది.
1989లో షారుక్‌ఖాన్ నటించిన టీవీ సిరీస్ ‘సర్కస్’తో పాటు 1993లో వచ్చిన రజిత్ కపూర్ బయో డిటెక్టివ్ షో ‘బ్యోమకేశ్ బక్షి’లను శనివారం నుంచి ప్రసారం చేయనున్నట్లు దూరదర్శన్ తన అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. సర్కస్‌ను రాత్రి 8 గంటలకు, బ్యోమకేశ్ బక్షి ఉదయం 11 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. (‘ఫస్ట్ టైమ్ నెలకు 1000 రోజులు’ )